మరో 30 ఏళ్లు జగనే సీఎం: మంత్రి ఆదిమూలపు సురేశ్

  • జగన్ ప్రజారంజక పాలన అందిస్తున్నారన్న సురేశ్ 
  • టీడీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని కామెంట్ 
  • లోకేశ్ సైకిల్ యాత్ర వల్ల ఒరిగేదేమీ లేదని విమర్శ 
ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ప్రజారంజక పరిపాలనను అందిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ కొనియాడారు. పలు సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నారని చెప్పారు. మరో 30 ఏళ్లు ఏపీ సీఎం జగనే అని ధీమాగా అన్నారు. 

అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలు అంతులేని అవినీతికి పాల్పడ్డారని... అందువల్లే ప్రస్తుతం టీడీపీకి ఈ గతి పట్టిందని అన్నారు. తలకిందుల తపస్సు చేసినా టీడీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. పాదయాత్ర వల్ల, బస్సు యాత్రల వల్ల టీడీపీకి ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. నారా లోకేశ్ సైకిల్ యాత్ర వల్ల ఒరిగేదేమీ లేదని చెప్పారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Adimulapu Suresh
Jagan
Nara Lokesh
Telugudesam

More Telugu News